రాజంపేట మండలం కొల్లావారిపల్లి గ్రామం
🟢 రాజంపేట మండలంలోని కొల్లావారిపల్లి సచివాలయము నందు జగనన్న సురక్ష క్యాంపులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారికి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటీ అమర్నాథ్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన కొల్లావారిపల్లి గ్రామస్తులు
🟢 ఈరోజు కొల్లావారిపల్లి గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న లబ్ధిదారులు మొత్తం ఇళ్ళ సంఖ్య 893, సర్వే పూర్తి అయిన ఇళ్ల సంఖ్య 701 , ఇన్కమ్ సర్టిఫికెట్స్ 70, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ 70,RoR 1B 30, ఆధార్ కార్డ్ సర్వీసెస్ 13, 233 మొత్తం సర్టిఫికెట్లు ఆన్లైన్ చేయడం జరిగినది ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటీ అమర్నాథ్ రెడ్డి గారు గారి చేతులు మీదుగా జగనన్న సురక్షాలు మంజూరైన పత్రాలను ఆయా లబ్ధిదారులకు అందజేశారు.
🟢 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కొల్లావారిపల్లి పంచాయతీలో ఏ ఒక్కరూ పౌరు సేవలు, సంక్షేమ పథకాలు రాక ఇబ్బందులు పడకూడదని ఈరోజు ఇక్కడ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి మీ సమస్యలకు ఇక్కడే తక్షణమే పరిష్కారం చూపండి జరుగుతుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
అలాగే ఎమ్మెల్యే గారు ..ఈ జగనన్న సురక్ష కార్యక్రమం అంటే ఏమిటో వివరించారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ
పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అర్హులైన ప్రతీ పేదవాడికి కుల మతాలకు అతీతంగా, పార్టీలను సహితం లెక్కచేయకుండా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని
ఈ క్రమంలో సాంకేతిక కారణాలు వల్ల అక్కడక్కడా కొంతమందికి సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందడం లేదని, నేడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా పరిష్కారాలు అధికారులు సమక్షంలో పరిష్కారం కల్పించడం జరుగుతుందని
ఈరోజు మీ కుచువారిపల్లి పంచాయతీలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అటువంటి సమస్యలు 100% నూరు శాతం పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు.
దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళు అంటే అమితమైన ప్రేమా అభిమానమని, ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందాలని తద్వారా వారిని ఆర్ధికంగా బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యమని అందుకే అర్హత ఉండీ సంక్షేమ పథకాలు రానివారి వివరాలు సేకరించి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కారం చేసి ప్రతీ లబ్దిదారులకు ఆర్ధిక స్వావలంబన దిశగా మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ప్రతినిధి దాసరి పెంచలయ్య గారు, వైయస్సార్సీపి రాజంపేట మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు రామ్మోహన్ నాయుడు గారు, రాజంపేట గ్రామీణ జెసిఎస్ కన్వీనర్ ఇంచార్జ్ మందరం గంగిరెడ్డి గారు, రాజంపేట మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ గౌస్ బాషా గారు, రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు, సత్యాల రామకృష్ణ గారు,కత్తి నరసింహులు గారు, దాసరి మహేష్ గారు, పోలి మురళి రెడ్డి గారు, విశ్వనాధ్ రెడ్డి గారు, దండు గోపి గారు, సచివాలయం కన్వీనర్ వెంకటేష్ నాయుడు గారు ,ఎం. రమణ రెడ్డి గారు, కాశినేని ప్రభాకర్ గారు, ఎం. వెంకట రెడ్డి గారు, చికెన్ శ్రీను గారు, బి. సుబ్బారెడ్డి గారు, వి .చంద్ర రెడ్డి గారు, జి .సుబ్బరాయుడు గారు ,ఎం. జయరాం గారు, పాగాల మనీ గారు, అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments
వంశి కేబుల్ డిష్ నెట్ వర్క్ కి స్వాగతం సు స్వాగతం పలుకుతుంది మీ చేర్మెన్ గారు వంశి కృష్ణ గారు వై చేర్మెన్ గారు శ్రీనివాసులు గారిని సంప్రదిచండి మీకు కొత్త కనేసన్ కావాలా నుకుంటే మమలినే సంప్రదిచండి మీకు దన్యవాదములు