కనుపూరు చెరువు మట్టి తవ్వకాల వెనుక భారీ కుంభకోణం



కనుపూరు చెరువు మట్టి తవ్వకాల వెనుక భారీ కుంభకోణం


VBC NEW : మంత్రి కాకాణి కనుసన్నల్లోనే నిత్యం వందలాది టిప్పర్లతో మట్టి దందా

ఓ టిప్పర్ యాక్సిడెంట్ ను టీడీపీకి ఆపాదించి దొంగలే దొంగ దొంగ అంటూ ఊరేగుతున్నారు

సీబీఐ విచారణ జరిపిస్తే మట్టి దొంగలెవరో తేలుతుంది

రైతుల పేరుతో దరఖాస్తు చేసిన వారి వివరాలను కోరితే అధికారులు వణికిపోతున్నారు
 
నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద మీడియాతో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు బొమ్మి సురేంద్ర, రావూరు రాధాకృష్ణమనాయుడు, గుమ్మడి రాజాయాదవ్

మట్టి తవ్వకాలకు వచ్చిన దరఖాస్తులు, ఇచ్చిన అనుమతుల వివరాలను బయటపెట్టాలని ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈలను నిలదీసిన టీడీపీ నేతలు

టీడీపీ నాయకుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈ

సాయంత్రానికి వివరాలు ఇస్తామని చెప్పి పత్తాలేకుండా పోయిన అధికారులు 

టీడీపీ నేతల కామెంట్స్

కనుపూరు చెరువులో మట్టితవ్వకాలకు సంబంధించిన వచ్చిన దరఖాస్తులు, ఇచ్చిన అనుమతుల వివరాలను బయటపెట్టాలని అధికారులను కోరాం 

సాయంత్రం 4 గంటలకు వివరాలన్నీ ఇస్తానని నమ్మించిన ఇరిగేషన్ ఈఈ 3.50 గంటలకే కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోయారు 

మట్టి అనుమతులకు సంబంధించిన వివరాలను కోరితేనే అధికారులు వణికిపోతున్నారు 

ఎక్కడి నుంచో వచ్చిన ఒత్తిళ్లకు లొంగిపోయి సమాచారం ఇవ్వలేక మాయమాటలు చెప్పి పారిపోయారు 

రాజకీయ అండతోనే కనుపూరు చెరువులో మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని దోచేశారు 

నాలుగు నెలలుగా కనుపూరు చెరువులో మట్టి దందా జరుగుతుంటే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కళ్లు మూసుకు కూర్చున్నారా 

ఓ టిప్పర్ యాక్సిడెంట్ ను టీడీపీకి ఆపాదించి టీడీపీ నేతలే మట్టి తవ్వకాలు జరుపుతున్నారని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుందా 

దొంగలే దొంగ దొంగ అంటూ బ్యానర్లు పట్టుకుని ఊరేగడం వైసీపీ నేతలకే చెల్లింది

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుచరులు మట్టి తోలుకుంటుంటే ఆపలేని అసమర్ధ పరిస్థితుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా 

సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు, అనుమతులు ఎవరు చెబితే ఇస్తున్నారు

నిత్యం సాయంత్రానికి కాకాణి ఇంటికి మట్టి కలెక్షన్లు చేరుతున్నాయి 

కాకాణికి కప్పం కట్టేవారు తప్ప మిగిలిన వైసీపీ నేతలకు తట్ట మట్టి ఎత్తే దమ్ము లేదు 

కనుపూరు చెరువులో మట్టి తవ్వకాలు ఆపాలని నాలుగు నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు తిరగని కార్యాలయం లేదు 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా చెరువులోకి వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. కలెక్టరేట్ స్పందనలోనూ ఫిర్యాదు చేశారు

తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు స్పందనలో ఫిర్యాదు చేసినా మట్టి తవ్వకాలను ఆపేవారు కరువయ్యారు

రైతులు తమ పొలాల్లోని మట్టిని ఇళ్లకు తోలుకుంటేనే కేసులు పెట్టే అధికారులకు కనుపూరు చెరువులో సాగుతున్న దందా కనిపించడం లేదా 

ఇష్టారాజ్యంగా వందల టిప్పర్లతో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు జరిపి శతాబ్ధాల చరిత్ర కలిగిన కనుపూరు చెరువును నాశనం చేసేశారు 

కనుపూరు చెరువు మట్టి తవ్వకాలతో వందల కోట్ల కుంభకోణం జరిగింది. మంత్రిగా ఉన్న కాకాణి సీబీఐ విచారణ జరిపించి మట్టిదొంగలెవరో తేల్చాలి

1K వీక్షణలు ప్రీమియర్ ప్రదర్శన తేదీ 14 డిసెం, 2022 #వాట్సాప్ #VBC #VBCNEWS


Post a Comment

0 Comments